అనంతపురంలో వైఎస్ జగన్‌ను కాపాడగలిగింది ఈ తోపుగాడు ఒక్కడే.. ?

 

అనంతపురం జిల్లాలో జేసీ వ‌ర్గానికి ఎదురు లేదన్న విషయం తెలిసిందే.. దాదాపుగా మూడున్నర ద‌శాబ్దాలుగా ఇక్కడ గెలుపు గుర్రాన్ని సవారి చేస్తున్న ఈ వర్గానికి చెక్ పెట్టాల‌ని చూసి విఫలం అయ్యారు.. ఇక ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న జేసీ కుటుంబం ఆ పార్టీ హవా కాస్త తగ్గినట్లుగా కనబడగానే 2014లో టీడీపీలో చేరి త‌ర్వాత కూడా విజయ ఢంకా మోగించారు.. ఇలాంటి బలమైన వర్గాన్ని అనూహ్యంగా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడించాడు.. నిజానికి జేసీ వర్గాన్ని ఓడించి అనంతలో వైసీపీకి బాటపరిచారు..

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విజయంతో ఇక్కడ వైసీపీ పాగా వేయాలని ప్రయత్నించ వలసింది పోయి పెద్దారెడ్డి గెలిచి ఏడాదిన్నర తిర‌గ‌కుండానే ఇక్కడి వైసీపీ నాయకులు తలనొప్పి తెప్పిస్తున్నారట.. ఎవ‌రూ ఇప్పుడు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదట. ఏదైనా కార్యక్రమం ఉంటే వచ్చి చుట్టపు చూపుగా ప‌ల‌క‌రించి వెళ్లిపోతున్నారట. ఈ పరిమాణాల నేపధ్యంలో త‌న‌పై జేసీ వ‌ర్గం కుట్ర చేస్తోంద‌ని అంటున్నారు పెద్దారెడ్డి. ఇకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో రికార్డు సృష్టించిన నాయ‌కుడు అని మరచినట్టున్నారు ఇక్కడి వైసీపీ నాయకులు..

జేసీ కుటుంబాన్ని ఓడించి వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించారు. నిజానికి ఇక్కడ అనేక పార్టీలు.. అనేక రూపాల్లో జేసీ వ‌ర్గాన్ని ఢీకొన్నాయి కానీ విజయం మాత్రం సాధ్యప‌డ‌లేదు. చివరకు వైసీపీ తరపున ఆ పనిని కేతిరెడ్డి పెద్దారెడ్డి చేశారు.. ఇతన్ని ప్రస్తుతం కాపాడుకోవలసిన పరిస్దితి ఉంది.. అలాంటి సమయంలో ఇలా దూరం పెట్టడం లాంటి పనులు చేస్తే ఒక వేళ బీజేపీ గనుక అవకాశం ఇస్తే లేదా మరేదైనా రాజకీయ చందరంగం జరిగితే ఇక్కడ వైసీపీ పట్టుకోల్పోవడం ఖాయం అంటున్నారట విశ్లేషకులు..

మరి అనంతపురంలో వైఎస్ జగన్‌ను కాపాడగలిగిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ని వర్గపోరు నుండి మిముక్తున్ని చేసి ఇక్కడి పార్టీ నాయకులు సహకరించే విధంగా వైఎస్ జగన్ స్పందిస్తే పార్టీ ఉనికి ఈ నియోజక వర్గంలో ఉంటుందంటున్నారు. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి కి ఇక్కడి నాయకులకు వ్యక్తిగతంగా ఉన్న బేధాభిప్రాయాలను పక్కన పెట్టి వైసీపీ ని బలోపేతం చేసే దిశగా ఇక్కడి నేతలు ముందుకు వస్తారో లేదో చూడాలి..