Spiny Gourd Benifits: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల వల్ల సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం . మనం తీసుకునే ఆహారం లేదు మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది . ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషక విలువలు లభిస్తాయి . ముఖ్యంగా మనం ఉన్న పాండమిక్ సిచువేషన్ లో రోగ నిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరం .
కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. కానీ.. ఈ ఒక్క కూరగాయలు అనేక రకాల విటమిన్స్ , మినరల్స్ , క్యాల్షియం , పొటాషియం , వంటి ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషక విలువలు ఉంటాయి . అందుకే ఈ కూరగాయలను పోషకాల గని అని కూడా చెప్పవచ్చు . ఆ కూరగాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం .
అడవి కాకరకాయ , బోడ కాకరకాయ అంటూ పిలవబడే ఈ కూరగాయలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెరగటానికి ఉపయోగపడుతుంది . బోడ కాకర కాయలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ ఉంటాయి. అందుకే ఈ కూరగాయలను పోషకాల గని అని కూడా అంటుంటారు .
ఈ కాకరకాయను తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది .ఇందులోని కెరోటినాయడ్స్ కంటి సంబంధిత వ్యాధుల నివారణకు సహాయపడుతుంది . ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
గర్భిణి స్త్రీలు ఈ కాయను తినటం వల్ల గర్భంలోని శిశువు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రించటంలో సహాయపడతాయి . బిపి , క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది .