పుట్టి నెల కూడా కాకముందే ఆ పసికందును చిదిమేసిన తల్లి?

పిల్లలు దేవుడితో సమానం అని అంటూ ఉంటారు. అలాంటి పిల్లలు నువ్వు చూసినప్పుడు ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఇట్టే మర్చిపోతారు. అందులోనూ ఇంకా చిన్న పిల్లలు అంటే వారు చేసే చిన్న చిన్న పనులే చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి చిన్న పిల్లలను ఒక మాట అనడానికి, తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ మనసు ఒప్పదు. కానీ ఒక మహిళ మాత్రం కన్నబిడ్డనే పుట్టిన కొన్ని రోజులు కాకుండానే చంపేసింది. ఆ బిడ్డ పట్ల ఆమె కర్కశంగా ప్రవర్తించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ దారుణమైన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఒక తల్లి నెలలు పూర్తి కాకుండానే ఒక బిడ్డకి జన్మించింది. దీనితో ఆ శిశువు ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా ఉండేది. పుట్టినప్పటి నుంచి కొన్ని రోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధ పడుతూనే ఉంది. ఆ శిశువు కన్న తల్లి ఆ పసిబిడ్డను హాస్పటల్ కి తీసుకెళ్లడం వైద్యులకు చూపించడం, ఇలాంటివి ఎన్ని చేసినా కూడా ఆ చిన్నారి ఆరోగ్యం కుదుట పడలేదు. ఒకవైపు ఆ చిన్నారి అనారోగ్యం తగ్గకపోవడం, అలాగే ఏడుస్తూ ఉండడంతో ఆ పసికందు ఆరోగ్యం మరింత క్షీణించింది.

దీనితో మరొకసారి తన తల్లి ఆ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ పసికందు కన్నతల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పని చేస్తోంది.ఇక ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్ కు ఆ మహిళ మీద అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ శిశువు పోస్టుమార్టం తర్వాత ఒక పోలీసు అధికారి సర్జన్ తో మాట్లాడగా, ఆ శిశువు తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని తెలపడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ శిశువు తల్లిని విచారించగా, ఆ పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని ఆ విషయం తెలిసి కూడా తాను అతనితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇక ఆ పసికందు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, ఆమె కొంత మానసిక అసౌకర్యానికి గురయ్యి చివరికి కోపంతో తానే కొట్టడంతో చనిపోయింది అంటూ ఆ కన్నతల్లి అంగీకరించింది.