బెల్లీ ఫ్యాట్ ను సులువుగా తగ్గించుకోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!

ఒక ఆనియన్ తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. కొబ్బెర తురుము లాగా ఈ ఆనియన్ ను ఒక గిన్నెలో తురుముకోవాలి. ఆ ఆనియన్ తురుమును ఒక బట్టలో వేసి రసం వచ్చేలాగా పిండాలి లేదంటే వడపోతలో వేసి స్పూన్ తో గట్టిగా నొక్కినట్లయితే రసం బయటకు వస్తుంది.

ఆ వచ్చిన ఆనియన్ రసంలో ఒక నిమ్మకాయను సగం కట్ చేసుకుని ఒక స్పూన్ నిమ్మకాయ రసాన్ని అందులో వేసి దానికి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ను వేసి కలపాలి. తర్వాత దీనికి ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్ ను ఉదయం పరిగడుపున అంటే ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ రసం తాగాలి.

ఇలా ప్రతిరోజూ చేయడం ద్వారా రెండు మూడు రోజుల్లోనే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. కేవలం పది నుంచి 15 రోజుల వ్యవధిలో మనం దీని రిజల్ట్ ను చూడవచ్చు.

పొట్ట చుట్టూ ఉండే అధిక కొవ్వు కరగడానికి మరొక చిట్కా తీసేసిన ఆనియన్ పొట్టును ఒక గిన్నెలో తీసుకొని అందులో ఒక నిమ్మకాయను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని రెండు గ్లాసుల వాటర్ ను అందులో వేసి బాగా మరిగించాలి. అప్పుడు అది బ్రౌన్ కలర్ లోకి వస్తుంది.

ఆ వచ్చిన దానిని వడబోసి రోజు రాత్రి డిన్నర్ కు ముందు ఒక టీ కప్ అంతా తాగినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తొందరగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. కనీసం 10 నుంచి 15 రోజులు కచ్చితంగా వాడినట్లయితేనే రిజల్ట్ అనేది మనం చూడగలం. దీన్ని ఫాలో అవుతూ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు.