అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే!

ప్రస్తుతం ఈ ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే ఎన్నో రసాయనాలతో తయారైన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇలా రసాయనాలతో తయారు చేసినవి కొందరి శరీరానికి సరిపోవు చర్మ సమస్యలు కూడా వస్తాయి కనుక సహజంగా మన సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఈ చిట్కా పాటించండి.

సాధారణంగా అమ్మాయిలకు పువ్వుల అంటే చాలా ఇష్టం. అందంగా ఉండటం ఎంత ఇష్టమో పువ్వులు కూడా అంతే ఇష్టం. అయితే అదే పూవులతోనే అందాన్ని రెట్టింపు చేయొచ్చు. పువ్వుల సువాసన వల్ల కలిగే అనుభూతిని బహుశా మరెక్కడా పొందలేమేమో. పువ్వులు అనగానే ఎక్కువగా పూజకు, తలలో పెట్టుకోడానికి, ఏదైనా ఫంక్షన్ కి ,ఇల్లు డెకరేట్ చేయడానికి వాడతాము. అయితే పూలతో ఫేస్ ప్యాక్ కూడా కూడా చేసుకోవచ్చు అని మీకు తెలుసా.. పూల తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం చాలా మృదువుగా, అందంగా కనిపిస్తుంది. మరి పూల ఫేస్ ప్యాక్ వల్ల ఎలాంటి ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఫ్లవర్స్ తో వేసుకునే ప్యాక్ ల వల్ల ఫేస్ అందమే కాకుండా.. జిడ్డుతనం, మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మం జిడ్డుగా ఉంటే.. మొటిమల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్మ సమస్యలన్ని తగ్గించడానికి ఫ్లవర్ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.

శీతాకాలంలో చర్మం పగుళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్ లు వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక రెండు చేమంతి పూలను వాటర్ లో బాగా ఉడికించిచ ఆ నీటిలో కొంచెం తేనె, పాలు పోసి బాగా కలుపుకొని ఇంటి నుండి బయటకి వెళ్ళేప్పుడు ముఖంపై బాగా మసాజ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే స్కిన్ రోజంతా ప్రకాశవంతంగా ఉంటుంది.

ఒక పెద్ద తామర పువ్వును తీసుకుని దానిని బాగా శుభ్రపరిచి రేకులను వేరు చేసి నీటిలో ఉడకనివ్వాలి. ఆ నీరు చల్లారాక అందులో రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో తీసుకొని ఫ్రిడ్జ్ లో భద్రపరచి రోజు ఫేస్ కి అప్లై చేస్తే చర్మం నిగ నిగ లాడుతుంది. తామర పూవులలో మినరల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇవి చర్మాన్ని మృదువుగా, తెల్లగా చేయడమే కాక మచ్చలను పోగొడుతుంది.

మొహం మీద జిడ్డు తనం తగ్గితే ఎలాంటి వారైన అందంగా కనిపిస్తారు. దీనికోసం మార్కెట్ లో ఈజీగా లభ్యమయ్యే బంతిపూల రెసిపీ చూద్దాం. రెండు బంతి పూలను తీసుకొని వాటి రెక్కలను పూర్తిగా తీసివేసి మిక్సీలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేయాలి. దానికి ఒక టీ స్పూన్ ఉసిరి పొడి, అంతే మోతాదులో పెరుగు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి బాగ జ్యూస్ లాగా చేయాలి. దీనిని రోజు ఉదయం మొహానికి పూసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా రెండు వారాలు చేస్తే జిడ్డు తగ్గిపోతుంది.

పాలను బాగా వేడి చేసి అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసి చల్లారనివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది. ముఖ తేజస్సు పెరగాలంటే 10 గులాబీ రెక్కలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు స్పూన్ల రోజ్ వాటర్, మూడు స్పూన్లు తేనె కలిపి దాన్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. తర్వాత ముఖానికి మసాజ్ చేసినట్టు అప్లై చేయాలి. కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles