Health Tips: వేసవి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతోపాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారటం మొటిమలు మచ్చలు ఇలా ఎన్నో రకాల చర్మవ్యాధులు వేధిస్తుంటాయి. వేసవికాలంలో చర్మ సంరక్షణకై చాలామంది బయట మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని ఉపయోగించడం కంటే మన ఇంట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాలను ఉపయోగించి మన చర్మాన్ని వేడి నుండి రక్షించవచ్చు.
వేసవి కాలంలో సరైన చర్మ సంరక్షణ తీసుకోకపోత చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. చర్మ సంరక్షణకై కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
వేసవి కాలంలో మజ్జిగతో చర్మ సౌందర్యం రెట్టింపు చేయవచ్చు. కొంచం శెనగపిండి, కొన్ని మజ్జిగ వేసి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని శుభ్రం చేసుకోవడం వల్ల ఒకరి మీద ఉన్న జిడ్డు మొత్తం తొలగిపోతుంది. గుప్పెడు సెనగలు పాలలో నానబెట్టి ఉదయం లేవగానే వాటిని మెత్తగా రుబ్బి మొహానికి రాసుకోవటం వల్ల ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
మజ్జిగ ముఖానికి మంచి టోనర్ గా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మజ్జిగ ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని దూదితో ముఖంపై అప్లై చేయాలి. బాగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
వేసవిలో ఎండకి బయట తిరిగి వచ్చిన తరువాత వేడికి చర్మం మొత్తం కమిలిపోయి ఉంటుంది ఇటువంటి సమయంలో ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ కలిపి ముఖం మీద బాగా మర్దన చేయాలి. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవటం వల్ల ముఖం కాంతివంతంగ కనిపిస్తుంది.