ఆధునిక కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వాతావరణం కాలుష్యం పెరగటం వల్ల మనం తీసుకునే శ్వాస కూడా కల్తీగా మారి దీని ప్రభావ ఊపిరితిత్తుల మీద పడుతుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు, ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి. సహజమైన వ్యాయామాలు చేయటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను అదుపు చేయవచ్చు.
శ్వాస సంబంధిత వ్యాయామాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరచడానికి మాత్రమే కాకుండా మనసును శాంత పరిచి, ఒత్తిడి తగ్గిస్తుంది.
మన శరీరాన్ని రోజు స్నానం చేసి శుభ్రంగా ఎలా ఉంచుకుంటమో మన ఊపిరి తిత్తులను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే వాతావరణంలోని కలుషితమైన గాలి పీల్చకుండా, పొగాకు సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి వంటి వాటికి దూరంగా ఉండి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచవచ్చు.
శ్వాస సంబంధిత వ్యాయామాలలో ఒక దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.4-7-8 బ్రీథింగ్ టెక్నిక్ ద్వారా మనం ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
మొదటగా వెల్లకిలా నేలపై పడుకొని అరచేతులను పొట్ట మీద ఉంచాలి. నాలుగు సెకన్లపాటు ముక్కుతో గాలిని పీల్చాలి. తర్వాత మనం పీల్చే గాలిని 7 సెకండ్లపాటు నెమ్మదిగా వదలాలి. తర్వాత 8 సెకన్లపాటు నోటిగుండా గాలిని వదలాలి. ప్రతి రోజు ఇలా 20 నిమిషాల పాటు చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన మెదడుని రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి కండరాల లోపల నుండి కూడా విముక్తి లభిస్తుంది.