Kivi Fruit Benifits: అందమైన చర్మం మీ సొంతం కావాలంటే..!కివి పండుతో ఇలా చేయాల్సిందే!

Kivi Fruit Benifits: కివి పండు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి జబ్బుల బారిన పడిన కూడా వాటి నుండి త్వరగా కోలుకోవడానికి కివి పండ్లు తింటే సరిపోతుంది. డెంగ్యూ వ్యాధి వల్ల ప్లేట్లెట్లు తగ్గిన వారు ఒక కివి పండు తింటే త్వరగా రికవరీ అవుతారని అందరికీ తెలిసిన విషయమే.కివి పండు ఎన్నో జబ్బుల నుండి రక్షించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా తక్షణమే పెంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు గుండె జబ్బులను నయం చేయడం, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, రక్తహీనతను తగ్గించడానికి కివి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కివి పండ్లు శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కివి పండు ని చర్మ సౌందర్యాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం….

• ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కివి పండ్ల గుజ్జు, కొద్దిగా పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నుండి 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల నల్ల మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
• ఒక కప్పు కివి పండ్ల గుజ్జు తీసుకొని దానిలో కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళకింద ఉన్న నల్లటి వలయాలు మీద రాసుకోవాలి .పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారం లో రెండు సార్లు చేయడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గి ముఖం అందంగా కనిపిస్తుంది.
• ఒక కప్పు కివి పండ్ల గుజ్జు కొద్దిగా తేనె మరియు నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయండి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మొటిమలు తగ్గి, మృతకణాలు తగ్గిపోయి చర్మం కాంతివంతం అవుతుంది.