కరోనా వైరస్ అనేది ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దీని వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా ప్రపంచమంతా విస్తరిస్తోంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాక కూడా ఒమిక్రాన్ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని నివారించడానికి ప్రపంచం దేశాలు కోవిడ్ -19 రెండు డోసులతో పాటుగా బూస్టర్ డోస్ వేస్తున్నారు.
అయితే ఈ బూస్టర్ డోస్ ను ప్రజలకు త్వరగా చేరవేయడానికి మరియు వారిలో అవగాహన పెంచడానికి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో నగర పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2021 డిసెంబర్ 31 లోగా కోవిడ్ -19 బూస్టర్ డోస్ పొందినవారికి నగదు బహుమతిని ప్రకటించారు. ఇంతకు మునుపు కోవిడ్ 19 రెండు డోసులు తీసుకొని మూడో డోస్ అనగా బూస్టర్ డోస్ కి అర్హులైన పౌరులకు 100 డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీలో దాదాపు 7568 రూపాయలు బహుమతిని ప్రకటించారు.
న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయం నుండి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ” ఇది చాలా గొప్ప అవకాశం. బూస్టర్ డోస్ ని పొందండి మీ కుటుంబాన్ని నగరాన్ని రక్షించండి “అని రాసింది. ఇంతకు మునుపు కూడా న్యూయార్క్ నగరంలో లో కారం సైట్లో tika మొదటి వ్యక్తులకు దాదాపు 100 డాలర్లు ఇచ్చారు ఇది జూలై లో జరిగింది. ఈ డబ్బును ప్రీపెయిడ్ డెబిట్ కార్డు లేదా ఈమెయిల్ ద్వారా అందిస్తున్నారు.
గత వారం రోజుల్లో న్యూయార్క్ నగరంలో సగటున 9300 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. గత వారంలోనే 75% కొత్త కేసులను కనిపెట్టారు. కేవలం ఒక వారంలోనే ఒమిక్రాన్ కేసులో దాదాపు ఆరు రెట్లు పెరిగాయని చెబుతున్నారు. న్యూయార్క్ ప్రాంతంలో వచ్చిన కొత్త కేసులలో దాదాపు 90 శాతం వాటిని ఒమీక్రాన్ గా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్ రేట్ , కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం డబ్బు ఇచ్చి మరీ వాక్సిన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.