చింత పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ప్రపంచంలో చింతపండుని వంటకాలలో రుచికి మాత్రమే ఉపయోగిస్తారు. చింతపండు రుచికే కాదు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. నిజానికి చింతపండు మొక్క ఆఫ్రికాకు చెందినది. ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలో చింతపండును ఉత్పత్తి చేస్తున్నారు. సాధారణంగా చింతపండు పులుసును వంటకాలలో ఉపయోగిస్తారు. చింత చెట్టు ఆకు,పువ్వులు కూడా వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చింతపండు కేవలం రుచిని ఇచ్చే ఏజెంట్ల మాత్రమే కాకుండా యుగయుగాలుగా ఒక ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. చింతపండు బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్ సి, ఎ, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చింతపండు మన శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను సమతుల్యం చేసే అధిక బరువు సమస్య నుండి విముక్తి ఇస్తుంది.
రక్త పోటు సమస్యతో బాధపడేవారు చింతపండు గుజ్జును ఉపయోగించడం వల్ల వారి సమస్యను కంట్రోల్ చేయవచ్చు. షుగర్ వ్యాధితో బాధ పడేవారు కూడా చింతపండు గుజ్జు వల్ల వారి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

చింతపండులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. చింతపండు గుజ్జు మాత్రమే కాకుండా చింత చెట్టు ఆకులు ,పువ్వులు ,చింత చెట్టు బెరడు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. చింత చెట్టు బెరడు నుండి తయారుచేసిన టానిక్కులు అల్సర్ తగ్గించడానికి ఉపయోగిస్తారు.
చింతపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని కూడా తగ్గించుకొని చింతపండు గింజలు ఎంతో ఉపయోగపడతాయని ఒక అధ్యయనం తెలిపింది.