రెడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా… అస్సలు ఉండలేరు..?

ఈ మధ్యకాలంలో ఎవరు చూసిన మొదటిగా ఇబ్బంది పడే సమస్యలలో అధిక బరువు సమస్య ఒకటి. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి మనకు రైస్ తినకుండా, చపాతీ ,రోటి అని డైట్ ఫాలో అవుతుంటారు. ఇలాంటి వారి కోసమే మరొక అద్భుతమైన ఔషదం దొరికింది. అదే “రెడ్ రైస్”.రెడ్ రైస్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే తినకుండా ఉండలేరు.

అన్నం ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది, అదే రెడ్ రైస్ ఐతే చూడటానికి ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం తినేటపుడు జీడిపప్పు లాగా కాస్త మెత్తగా ఉంటాయి. వీటిని ఉడికించేటపుడు, 3 రెట్లు ఎక్కువ నీళ్లు వేసి సిమ్ లో పెట్టి ఉడికించాలి.రెడ్ రైస్ లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ కనుక దీనిని తింటే బరువు పెరుగుతారు అని సందేహం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా రెడ్ రైస్ నీ సూచిస్తున్నారు.

రెడ్ రైస్ లో ఉండే మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ తో భాద పడుతున్న వారికి చాలా ఉపయోగపడతాయి. అలాగే, రెడ్ రైస్ ఇన్సులిన్ లెవెల్స్ ను కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. రెడ్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డైజేషన్ ప్రాసెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం బ్రీతింగ్ ప్రాబ్లెమ్ తగ్గించి ఆస్తమా అటాక్స్ ను తగ్గిస్తుంది.రెడ్ రైస్ లో ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఆక్సిజన్ ను శరీరం గ్రహిస్తుంది. దీనితో మీరు మరింత యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే అధిక బరువుతో బాధపడేవారు రైస్ తినడం వల్ల తొందరగా శరీర బరువును తగ్గవచ్చు.