ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ద పెరిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల చిట్కాలను ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాటిలో హెర్బల్ టీ వినియోగం ఎక్కువైపోయింది. హెర్బల్ టీ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు జీవితంలో టీ అనేది చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టీ తాగటం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఒక కప్పు టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అయితే సాధారణంగా మార్కెట్లో దొరికే టీ కాఫీలు అనారోగ్యమని దీనికి బదులుగా చాలామంది ఈ మధ్యకాలంలో హెర్బల్- టీ ప్రిఫర్ చేస్తున్నారు.
హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీ రుచికరమే కాకుండా దీనిలో చాలా ఔషధ గుణాలు ఉండటం వలన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. హెర్బల్- టీ జలుబు మరియు దగ్గు తగ్గిస్తుంది.
హెర్బల్ టీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. హెర్బల్- టీ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి అధిక బరువు సమస్య నుండి విముక్తి లభిస్తుంది. హెర్బల్- టీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
హెర్బల్- టీ ప్రతిరోజు తాగటం వలన ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. హెర్బల్- టీ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. హెర్బల్ టీ జ్ఞాపక శక్తిని మరియు బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది.