Health Tips: ప్రస్తుత కాలంలో ఆహార పద్ధతుల లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో నెయ్యి తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ నెయ్యి లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల నెయ్యి తింటే బరువు పెరుగుతారు అని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ మితంగా నెయ్యి తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు అవంతి దేశ్‌పాండే
వెల్లడించారు. నెయ్యి తినటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ప్రతి రోజూ ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూను నెయ్యి తినడం వల్ల దీర్ఘ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆహారం త్వరగా జీర్ణం అవటానికి ఉపయోగపడే బ్యుటిరెట్ ఫ్యాటీ యాసిడ్ నీలో ఎక్కువగా ఉండటం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవు.
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంద.కావున అధిక బరువుతో బాధపడే వారు రోజు వారి ఆహారంలో మితంగా తీసుకోవడం వల్ల కూడా వారి సమస్యను దూరం చేయవచ్చు.
ప్రతిరోజు నెయ్యి తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు నెయ్యి తినడం వల్ల వెన్నెముక దృఢంగా,బలంగా తయారవుతుంది. తద్వారా వెన్ను నొప్పి వంటి సమస్యలు దరిచేరవు.