Neem Oil: వేప చెట్లు ఎటువంటి ప్రదేశంలో అయినా బ్రతుకుతాయి. మన పరిసర ప్రాంతాల్లో, పొలాలలో, పార్కులలో ఎక్కడపడితే అక్కడ ఇవి విరివిగా ఉంటాయి. వేపాకులను కానీ , వేప నుండి తయారయ్యే ఇతర పదార్థాలు ఆయుర్వేదంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వేప నూనె లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేప నూనె వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..
దోమల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దోమల నివారణకు చాలామంది ఆల్ ఔట్ , మస్కిటో కాయిల్స్ వాడటం వంటి ఉపయోగిస్తుంటారు.. అయినా దోమలను పూర్తిగా నిరోధించడం కష్టం. వేప నూనెను ఉపయోగించి దోర్నాల ను నివారించవచ్చు. ఒక అర లీటర్ నీటిలో రెండు టీ స్పూన్ల వేప నూనెను కలిపి పరిసరాలు, ఇంటి మూలలు, దోమలు ఉన్న ప్రదేశాల్లో చల్లడం ద్వారా దోమలు రాకుండా నియంత్రించవచ్చు.
పూర్వము దంతాలు శుభ్ర పరచడానికి వేప పుల్లలని ఉపయోగించేవారు. క్రమేపీ మారుతున్న కాలంతో పాటు టూత్ బ్రష్ లు , పేస్ట్ అలవాటయిపోయింది. చిగుళ్ల సమస్యలు, దంత సమస్యలు, దంతాల నొప్పులు, చిగుళ్ల నొప్పులు ఉన్నవారు వేప నూనెతో బ్రష్ చేయడం ద్వారా దంతాల సమస్యలు అరికట్టవచ్చు.
వేప నూనెను పొలాలలో క్రిమికీటకాలను నాశనం చేయటానికి స్ప్రే చేస్తుంటారు. మీ గార్డెన్లో లేదా చిన్నచిన్న మొక్కల మీద వేప నూనెను చల్లడం ద్వారా క్రిములను నాశనం చేయవచ్చు. మీ ఇంటి మూలలో, చిన్నపిల్లలు సంచరించే ప్రదేశాలలో చల్లడం ద్వారా బ్యాక్టీరియా నుండి వారిని దూరం చేయవచ్చు.
గాయాలు పుండ్లు అయిన చోట వేప నూనెను ఆ గాయం మీద రాయటం ద్వారా వేప నూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గాయం త్వరగా నయమవుతుంది. పురుగులు, కీటకాలు కుట్టిన ప్రదేశాలలో వేప నూనె రాయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
జుట్టు రాలుతునన్నా , చుండ్రు సమస్యలు , జుట్టు ఒత్తుగా పెరగాలంటే వారంలో రెండు సార్లు వేప నూనెను అంటించి ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు సమస్యలు తొలగిపోయి ఒత్తుగా పెరుగుతుంది.
చలికాలంలో చర్మం పగులుతుంది. దీనికి వ్యాసిలిన్, మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తుంటారు. స్నానం చేయడానికి ఒక గంట ముందు వేప నూనె రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పగుళ్ళు లేకుండా మృదువుగా తయారవుతుంది.