Health Tips: మొక్కజొన్నతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Health Tips: సకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అందరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో మధుమేహం కూడా ప్రధానమైనది. అనేక మంది మధుమేహ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి ఏవి తినాలన్న కూడా భయపడుతూ ఉంటారు. మొక్కజొన్న కి మధుమేహాన్ని నియంత్రించగలిగే శక్తి ఉంటుందని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చెబుతోంది. మొక్కజొన్న రకరకాల రంగులలో లభిస్తుంది. వీటిలో అధికంగా మార్కెట్లో మనకు లభించే మొక్క జొన్నలు గోధుమ రంగులో ఉంటాయి. మొక్క జొన్న కంకులను వివిధ విధాలుగా ఉడకబెట్టి, కాల్చి తింటుంటారు.

అయితే ఊదారంగు మొక్కజొన్న లలో మధుమేహాన్ని నియంత్రించగలిగే శక్తి ఉందని నిపుణులు తెలిపారు. ఉదారంగు మొక్కజొన్న లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఫైటోకెమికల్స్ అనేవి శరీరంలోని మంటను తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయని నిపుణులు తెలిపారు. ఊదా రంగులో ఉండే మొక్కజొన్న తరచూ తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడం, ట్రైగ్లిజరైడ్స్ శాతం తగ్గినట్లు గుర్తించారు. ఉదా రంగులో ఉండే మొక్కజొన్నలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం, క్లోమగ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.

మొక్కజొన్నలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ బి 1, బి 6, ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటి ఉంటాయి. మొక్కజొన్న కంకులు గా ఉన్నప్పుడే వీటిని తినవచ్చు. మొక్క జొన్నలు వివిధ రకాల ఆహార పదార్థాలను చేసుకొని తింటుంటారు. మొక్కజొన్నలు ఏ విధంగా తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మొక్కజొన్నలు రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తాయి.