మీ ఇంట్లో మెట్ల కింద ఇది ఉందా అయితే మీరే ఆ దురదృష్టం ఇంట్లోకి తెచ్చుకున్నట్లే..

మనిషి తన జీవితానికి డబ్బే జీవనాధారం అనుకుంటు డబ్బుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. కూటి కోసం కోటి విద్యలు అని మన పెద్దలు చెప్పకనే చెప్పారు. మనిషి జీవితంలో డబ్బుతో పాటు నివసించే ఇల్లు కూడా చాలా ముఖ్యమైనదే. ఇంట్లో కొన్ని రకాల వాస్తు లోపాల వల్ల ఎంత ప్రయత్నించినా అభివృద్ధి అనేది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

ఇంటికి వాస్తు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు, మరికొందరు ఇంటికి వాస్తు తప్పనిసరి అని భావిస్తారు. మనం ఇప్పుడు ఇంటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనిషి డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఇంటికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఇంట్లో కిటికీలు, అలాగే దర్వాజాలు లాంటివి సరి సంఖ్యలో ఉండాలి.

ఎందుకు అని అంటే సరి సంఖ్య అంటే పాజిటివ్. ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంటిలోనికి ఏదైనా శక్తి, దైవ శక్తి ప్రవేశించినప్పుడు అది వేరే ఒక మార్గం ద్వారా బయటికి వెళ్తుంది. ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేరువ అవుతాయి. బేసి సంఖ్యలో ఉంటే నెగటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో సమస్యలు పెరిగి ఆర్థిక సంక్షోభం ను ఎదుర్కోవాల్సి నా పరిస్థితి ఏర్పడవచ్చు.

ఇంకా ముఖ్యంగా మనం ఇంటి లోపల నిర్మించుకునే మెట్ల కింద ఎలాంటి పరిస్థితులలోనూ టాయిలెట్లను నిర్మించరాదు. అది ఆ ఇంటి యజమాని అభివృద్ధికి మంచిది కాదు. ఇంట్లో నిర్మించే మెట్లు వాస్తు చూసుకొని మెట్ల కింద టాయిలెట్లు రాకుండా నిర్మించుకోవాలి. ఒకవేళ మెట్ల కింద టాయిలెట్ ను నిర్మించినట్లయితే ఆ మెట్లపై ఆ ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎట్టి పరిస్థితులలోనూ వాడరాదు. ఇలా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కాస్త వాస్తు చూసుకొని ఎక్కడ ఏది నిర్మించుకోవాలి, ఎక్కడ ఏది ఉంచాలి అని తెలుసుకొని నిర్మించినట్లయితే సమస్యలు దూరమై ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.