మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా… ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే?

తరచూ మీరు చర్మ సమస్యలు, మూత్రశయ ఇన్ఫెక్షన్, చర్మం పై వాపులు, దద్దర్లు, చేతి గోర్లు రంగు మారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి లేదంటే ప్రమాదకర లివర్ సమస్యలు తలెత్తవచ్చు. సాధారణంగా మన శరీరంపై వచ్చే దద్దర్లు, మంట, దురద వంటి సమస్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే దీర్ఘకాలం పాటు ఈ సమస్యలతో బాధపడుతుంటే మనం లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నామని అర్థం చేసుకోవాలి.

మన శరీరంలో కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కాలేయ పనితీరు మందగించి కాలేయం శ్రవించే పిత్తం అనే మిశ్రమం రక్తంలో కలవడం ప్రారంభం అవుతుంది. దీని ఫలితంగా చర్మంపై దురద, మంట, దద్దులు వంటి సమస్యలు పంపిస్తాయి. అలాగే
కళ్ళు,గోర్లు పసుపు రంగులో మారుతాయి. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు గమనించినట్లయితే మూత్రం కూడా పసుపు రంగులో రావడం గమనించవచ్చు. ఈ సూచికలన్ని కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు దీర్ఘకాలం పాటు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మర్చిపోవద్దు.

మన కాలేయం ప్రోటీన్లను సరిగా ఉత్పత్తి చేయలేనప్పుడు మన శరీరంపై నీలిరంగు మచ్చలు కనిపించడంతోపాటు అరచేతిలో తరచుగా మంట, దురద వంటి సూచికలు కనిపిస్తాయి. కాలేయం పనితీరు మందగించి నప్పుడు ఈస్ట్రోజెన్ పరిమాణం పెరుగుతుంది. ఈ కారణంగా టైరోనేస్ అనే మూలకం శరీరంలో పెరిగి చర్మంపై గోధుమ లేదా నల్ల మచ్చలు కనిపిస్తాయి. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు స్పైడర్ వెబ్ వంటి చిన్న కణాలు చర్మంపై కనిపిస్తాయి. వీటిని స్పైడర్ యాంజియోమాస్ అంటారు. మన శరీరంలో హార్మోన్ల వ్యత్యాసం,పొత్తి కడుపు వాపు వంటి సూచికలు కనిపిస్తాయి.ఇలాంటి పరిస్థితులు కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.