Samantha: సినీనటి సమంత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన ఈమె తిరిగి మైయోసైటీస్ వ్యాధితో బాధపడ్డారు . ఇలా ఈ వ్యాధి కారణంగా సమంత దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఈ వ్యాధి కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ క్రమక్రమంగా వ్యాధి నుంచి బయటపడ్డారు.
ఇక ఇప్పుడు తన ఆరోగ్యం అంత స్థిమితంగానే ఉంది తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అవుతుందన్న తరుణంలోనే మరోసారి ఈమె హాస్పిటల్ బెడ్ పై కనిపించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ఫోటోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. చేతికి సైలన్ బాటిల్ తో బెడ్ పై సమంత కనిపించేసరికే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ సమంతకు ఏమైంది ఆమె ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
సమంత ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలుస్తోంది . సమంత పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నారు అయితే ఈమె హాస్పిటల్ బెడ్ పై కనిపించడం సినిమాలో బాగామని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత రక్త బ్రహ్మాండ్ అనే సినిమాలో నటిస్తున్నారు అందులో భాగంగా ఈ ఫోటోని షేర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.