సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉంటేనే వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. అయితే భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు గొడవలు రావడం సర్వసాధారణం.ఇలా గొడవలు చోటు చేసుకున్న సమయంలో ఇద్దరిలో ఎవరో ఒకరు అప్పటికి సైలెంట్ అవ్వడం లేదా అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగితే ఆ గొడవలు అక్కడితోనే ముగుస్తాయి. అయితే చాలామంది ప్రతి చిన్న విషయానికి పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు. అయితే మీలో గనక ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటే మీరు మీ బంధం నుంచి తొందరగా విడిపోతున్నారని మీ లైఫ్ పార్టనర్ తో మీరు సంతోషంగా లేరని అర్థం.
మీ జీవిత భాగస్వామి మీతో కలయికలో పాల్గొనాలి అనుకున్నప్పుడు మీరు తనని దూరం పెడుతున్నారు. అంటే మీ లైఫ్ లో మీరు సంతోషంగా లేరని అర్థం. ఇద్దరి మధ్య చోటు చేసుకుంటున్నటువంటి గొడవలు కారణంగా విడిపోవాలని అనుకున్న అలాంటి ఆలోచనలు వచ్చిన మీ బంధం కొద్ది రోజులలోనే తెగిపోతుందని అర్థం.ఇక ఇద్దరిలో ఎవరైనా కానీ లైఫ్ పార్ట్నర్ తో కాకుండా ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆలోచనలు కలిగిన మీరు జీవితంలో సంతోషంగా లేరని చెప్పడానికి ఇది కూడా ఒక లక్షణమే.
భార్యాభర్తలిద్దరూ కూడా ఓకే ఇంట్లో ఓకే గదిలో ఉంటున్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోవడం, ఎవరి పనివారు చూసుకుంటూ ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదని అర్థం.ఇలా భార్యాభర్తలిద్దరూ ఎవరి బతుకు వారని బతుకుతున్నట్లయితే అలాంటి బంధం ఎక్కువ కాలం నిలబడదు. జీవితం అంటే చిన్న చిన్న తగాదాలు గొడవలు సరదాలు ఉండాలి ఇలా కాకుండా లైఫ్ చాలా బోరింగ్ అనిపించింది అంటే మీరు సంతోషంగా లేరని తెలిపే లక్షణమే.