పురుషులు ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి ఇవే ప్రధాన కారణాల?

పెళ్లి బంధమైన, ప్రేమ బంధమైన, స్నేహమైన జీవిత కాలం పాటు సాఫీగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఇద్దరి మధ్య నమ్మకం, గౌరవం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది లేకపోతే మధ్యలోనే ఆ బంధం తెగిపోయే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒకరిపై ఒకరికి గౌరవం, శారీరక తృప్తి లేకపోతే ఆ బంధం బ్రేకప్ అవుతుంది.ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విచిత్రం ఏమిటంటే ఎక్కువ మంది పురుషులే తమ పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దానికి గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

భార్య భర్తలు మధ్య గొడవలు రేకెత్తి విడిపోవడానికి అసలు కారణం ఒకరిపై ఒకరు అధికారాన్ని చలాయించడమే. ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు మగవారిపై అధికారాన్ని చలాయించి ప్రతి విషయంలో వారిని నియంత్రించాలని చూస్తే పురుషులకు స్త్రీల నియంత్రిత్వ ధోరణి అస్సలు నచ్చదు.ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ బంధం నుంచి బయటపడడానికి ఆలోచిస్తాడు. పురుషులు తమ పార్ట్ నర్ నుంచి ప్రేమ ,ఆప్యాయత,గౌరవం కోరుకుంటారు. ఆ గౌరవం తమకు తమ భాగస్వామి నుంచి లభించడం లేదు అంటే అతి త్వరలోనే ఈ బంధం తెగిపోవాల్సి వస్తుంది.

పురుషుడు తన పార్ట్నర్ తనను మోసం చేస్తోంది అంటే అసలు సహించడు. దీన్ని తీవ్రంగా పరిగణించి ఆ స్త్రీ నుంచి దూరంగా వెళ్లడానికే ప్రయత్నం చేస్తాడు.
పురుషులు తమ లైఫ్ పార్ట్నర్ నుంచి సుఖవంతమైన జీవితాన్ని, రొమాన్స్, శారీరిక సంబంధాన్ని ఎక్కువగా కోరుకుంటాడు ఇలాంటివి దక్కకపోతే వేరే చోట దక్కించుకునే ప్రయత్నంలో ఇప్పుడున్న బంధానికి బ్రేకప్ చెప్పడానికి వెనకాడడు.తమను పొందే అర్హత వారికి లేదు అనే భావన కలిగినప్పుడు కూడా పురుషులు ఎక్కువగా బ్రేకప్ చెబుతూ ఉంటారట. చాలామంది పురుషులు కుటుంబం కోసం చాలా కష్టపడుతుంటారు.ఈ కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంస దక్కకపోగా అవమానాలు ఎదురవుతుంటే తట్టుకోలేక ఆ బంధాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.