క్యాన్సర్ రిస్క్ పెంచే లక్షణాలు సాధారణంగా కొన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించి ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు: నిరంతరంగా అలసట, జ్వరం, రాత్రి చెమటలు, సులభంగా గాయాలు, రక్తస్రావం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, కొన్నిసార్లు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కామెర్లు. అకస్మాత్తుగా గడ్డ, అసాధారణ రక్తస్రావం, వివరించలేని బరువు తగ్గడం, ప్రేగు కదలికలలో మార్పు కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
నిరంతర అలసట ఇది వివిధ రకాల క్యాన్సర్లకు సాధారణ లక్షణం, ప్రత్యేకించి రక్త క్యాన్సర్ (లుకేమియా) ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. జ్వరం మరియు రాత్రి చెమటలు ఉంటే ఈ లక్షణాలు కొన్ని రకాల క్యాన్సర్లకు సంబంధించినవి అయ్యి ఉంటాయి.. గాయాలు, రక్త స్రావం ఇది రక్త క్యాన్సర్లకు సంబంధించి ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఇతర రకాల క్యాన్సర్లకు సాధారణ లక్షణం అని చెప్పవచ్చు.
దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. కామెర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ఒక సాధారణ లక్షణం అని చెప్పవచ్చు. ఎక్కడైనా శరీర భాగాలలో గడ్డలు కనిపిస్తే రొమ్ము, శోషరస కణుపులు మరియు ఇతర అవయవాలలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి.
మలంలో రక్తం, మూత్రంలో రక్తం, గర్భాశయం నుండి రక్తస్రావం మొదలైనవి క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ప్రేగు క్యాన్సర్ ఉన్నవారికి ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖం, దవడ, లేదా నోటిలో వాపు దవడ క్యాన్సర్ యొక్క లక్షణం అని చెప్పవచ్చు. గొంతు మార్పులు, గొంతు నొప్పి స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు అని చెప్పవచ్చు. మూత్ర విసర్జనలో మార్పు ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం అని చెప్పవచ్చు.
ఈ లక్షణాలు క్యాన్సర్ యొక్క ప్రారంభ దశల్లో ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు క్యాన్సర్ మరింత అభివృద్ధి చెందే వరకు కనిపించకపోవచ్చు. కాబట్టి, మీ శరీరంలో ఏవైనా మార్పులను గమనించడం ముఖ్యం మరియు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.