మీ చేతులు, కాళ్లు చల్లగా ఉంటున్నాయా.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే!

చలికాలంలో చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే చలికాలంలో వాతావరణం మార్పుల వల్ల కొంతమందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. చలికాలంలో కాళ్లు, చేతులు చల్లగా ఉంటే ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే చేతులు, కాళ్లు చల్లగా మారే అవకాశం అయితే ఉంటుంది. విటమిన్ డి లోపంతో బాధ పడేవాళ్లలో చాలామందిని కూడా ఈ తరహా సమస్యలు వేధిస్తాయి. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యకాంతి పొందే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు కూడా చల్లని చేతులు, కాళ్ళు కలిగి ఉండే అవకాశం ఉంది.

నాడీ వ్యవస్థ రుగ్మతల కారణంగా కూడా చేతులు, కాళ్లు చల్లగా మారే ఛాన్స్ ఉంది. చేతులు, కాళ్ళు వేడెక్కకపోవడానికి రేనాడ్స్ వ్యాధి కూడా ఒక కారణం అవుతుందని చెప్పవచ్చు. కొన్ని మందులు దీర్ఘకాలం వాడటం వల్ల కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్-రిచ్ డైట్ తీసుకోవడంతో పాటు ఖర్జూరం, రెడ్ మీట్, యాపిల్స్, కాయధాన్యాలు, బీన్స్, బచ్చలికూర, బీట్‌రూట్, సూప్‌లు, సోయాబీన్స్ లాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి.

వేరుశెనగలు, చిక్‌పీస్, సూప్, అల్లం లడ్డు, చేపలు, పాలు, బెల్లం, జీలకర్ర, అల్లం టీ, యాలకులు, గుడ్లు, నల్ల మిరియాలు, పసుపు పాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వెచ్చని బట్టలు ధరించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.