Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. శరీరంలో ఏ విటమిన్ తగ్గినట్టే..!

Health Tips: శరీరారోగ్యానికి ఎన్నో రకాల పోషక విలువలు అవసరం. శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ ఒక్క విటమిన్ లోపించినా కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో విటమిన్స్ లోపిస్తే మెడికల్ షాప్ లో లభించే టాబ్లెట్స్ ఎక్కువ వినియోగిస్తున్నారు. కానీ మనం తీసుకునే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి. విటమిన్ కె కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

శరీరంలో విటమిన్ కె లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ కె లోపం ఉన్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటి ద్వారా విటమిన్ లోపాన్ని గుర్తించి సరైన వైద్యం తీసుకోవాలి. శరీరంలో శక్తి లేకుండా పెళ్లెప్పుడు అలసట, నీరసం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు తరచూ కనిపించినట్లయితే శరీరంలో విటమిన్ కె లోపించిందని సంకేతం.

ఎముకలు కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ కె చాలా అవసరం. తరచూ కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు, చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరగటం వంటి సమస్యలు విటమిన్ కె లోపం వల్ల తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ నీ సంప్రదించండి . గాయాలు అయినప్పుడు తొందరగా నయం కాకపోవటం, మల మూత్ర విసర్జన సమయంలో రక్తం రావటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు కూడా విటమిన్ లోపం వల్ల తలెత్తుతాయి. ఇటువంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం.

విటమిన్ కె లోపం ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. మనం తీసుకునే ఆహారంలో పచ్చి బఠాణీలు,క్యాబేజీ,బ్రోకలీ, కివి పండ్లు, డ్రై ఫ్రూట్, కీర దోస, ఎర్ర కంది పప్పు వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది.