Hypertension: ప్రస్తుత కాలంలో వాతావరణంలో మార్పులు , మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు సంపాదనలో పడి ఆహారం సరైన పద్ధతిలో తీసుకోకపోవటం , పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో రక్తపోటు సమస్య అధికంగా ఉంది.
బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉప్పు తినటం వల్ల , మద్యపానం సేవించడం , పొగ త్రాగటం , మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. రక్త పోటు సమస్య అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు , కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గించుకొనే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
రక్త పోటు సమస్యతో బాధపడేవారు వారు తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పచ్చళ్ళు ,ఎండు చేపలు , చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడేవారు మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అరటి పండ్లు , చిలకడ దుంపలు , పుట్టగొడుగులు , నారింజ , పాలకూర , బ్రోకలీ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వలన బ్లడ్ ప్రెషర్ నియంత్రించి ధమనుల గోడలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి.
శరీరంలో క్యాల్షియం లోపం ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి హై బీపీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రతిరోజు క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా ఉండి , మానసిక ఒత్తిడి తగ్గుతుంది.