Health Tips: ఆహార పద్దతులలో మార్పు రావడం, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో జుట్టు సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి.ముఖ్యంగా చుండ్రు వల్ల జుట్టు రాలి పోవటమే కాకుండా అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ చుండ్రుకు చెక్ పెట్టడానికి మార్కెట్లో లభ్యమయ్యే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. కానీ మన ఇంట్లో లభించే అల్లం వల్ల కూడా చుండ్రు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చుండ్రు సమస్య నివారణ లో అల్లం ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం వల్ల ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు సమస్యలు కూడా నియంత్రించవచ్చు. అల్లం నీ ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అల్లం ఉండే అనేక రకాల ఔషధగుణాలు వల్ల ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు. అల్లం ఉపయోగించి చుండ్రు సమస్య నివారించే చిట్కాల గురించి తెలుసుకుందాం.
అల్లం కొంచం తీసుకొని బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలి. కొంచం నువ్వుల నూనె తీసుకొని క్రష్ చేసిన అల్లం నీ అందులో వేసి కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ అల్లం కలిపిన నూనె తలకు రాసుకుని ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయటం వల్ల క్రమంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.
కొంచం అల్లం తీసుకొని దాన్ని బాగా మెత్తగా రుబ్బి దానిని నుండి రసం తీయాలి. ఈ అల్లం రసం లోకి కొంచం నిమ్మ రసం కలిపి దూదితో జుట్టు కుదుళ్లకు అంటేలా రాసుకోవాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయటం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.