శ్రీకాకుళం జిల్లా లో ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది ఒకే ఒక్కడు అతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ పాలించింది..టీడీపీ పాలిచింది..కేంద్రంలో ఎన్నో పార్టీలు అధికారం చేపట్టాయి. ఎంతో ముఖ్యమంత్రలు మారారు..ఎంతో మంది ప్రధానులు మారారు. కానీ వాళ్లెవ్వరికి పట్టని సమస్య పవన్ కళ్యాణి పట్టింది. అందుకే ఉద్ధానం గురించి భారతదేశంతో పాటు..ప్రపంచ దేశాలకు తెలిసింది. నిజంగా పవన్ కళ్యాణ్ గనుక ఉద్ధానం సమస్యను తెరపైకి తీసుకురాకపోయి ఉంటే మరో శతాబ్ధం పాటు అక్కడ కిడ్నీతో కన్ను మూయాల్సిందే.
జనసేన పార్టీ స్థాపితం అనంతరం పర్యటనలో భాగంగా ఉద్ధానం కిడ్నీ రోగుల గురించి తెలుసుకుని అక్కడికి విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఉద్దానంలో రియల్ హీరోగా నిలిచారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని 2014 లో అధికారంలో ఉన్న టీడీపీ కి అల్టిమేటం కూడా జారీ చేసారు. కానీ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ రాజధాని ముందు ఉద్ధానాన్ని నెత్తుకేసుకుంటే వచ్చేదేంటి? పోయేది తప్ప! అని గాలికి వదిలేసాడు. అయితే ఇప్పుడా బాధ్యతల్ని వైసీపీ ప్రభుత్వం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
700 కోట్ల రూపాయలతో ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం శమర శంఖం పూరించింది. హిర మండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైపు లైన్ల ద్వారా ఉద్దానానికి మంచినీటి సరఫరాకు నడుం బిగించింది. అలా తరలించిన నీటిని రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రజలకు అందజేయనున్నారు. అదే జరిగితే ఆరు లక్షల మందికి మంచి నీటి సౌకర్యం దొరికినట్లే. దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్న కిడ్నీ సమస్యల నుంచి ప్రజలంతా భయపడినట్లే. కేవలం తాగు నీరు లోపం వల్లే కిడ్నీ సమస్యలు తలెత్తున్నాయి అని డాక్టర్లు నిర్ధారించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తాత్కాలిక మందులు ఇస్తున్నారు తప్ప! శాశ్వత పరిష్కారం అనేదే లేకుండా పోయిందక్కడ.