ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలన్నీ సంచలనమే. సీఆర్ డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానులు ప్రతిపాదన, ఇసుకలో నూతన పాలసీ , దిశ చట్టం అన్నీ సంచనాలే కదా. అసలు జగన్ పాలన ఇలా ఉంటుందని ఎవరైనా ఊహించారా? ? కనీసం ఊహకు కూడా ఇలాంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. జగన్ నిర్ణయాలు ఎంత సంచలనంగా ఉంటున్నాయో! వాటిని అమలు పరిచే విధానం అంతే సంచలనంగా మారుతోంది. ప్రతిపక్షం, వామపక్షాల నుంచి ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున ఎదురవుతున్నప్పటికీ వాటికి ధీటైన బధులిస్తూ పాలనలో జగన్ మార్క్ వేస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దశాభ్దాలుగా పేద వాడిని పీక్కుతింటోన్న లంచంపై జగన్ శమర శంఖం పూరించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచరించారు. అధికారులు అవినీతికి పాల్పడకుండా చట్టాన్ని తీసుకురావలని నిర్ణయించారు. దిశ చట్టం తరహాలో దీనిపైనా అసెంబ్లీ లో చట్టం చేయాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిని ఎవ్వరిని వదలకుండా ఎంతటి వారినైనా శిక్షించేలా ఓ కొత్త చట్టం తీసుకొస్తే గానీ..లంచగొండుల భరతం పట్టలేమని జగన్ నిర్ణయించారు. రాష్ర్ట వ్యాప్తంగా వస్తోన్న ఫిర్యాదులను అనుసంధానం చేసి అవినీతిని నిరోధించేదుకు ప్రయత్నించాలన్నారు.
ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో రివర్స్ టెండరింగ్ తీసుకురావాలన్నారు. టెండర్కోటి దాటితే రివర్స్ తప్పనిసరి అని, పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్ట్, భోగాపురం విమానశ్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి జగన్ లంచగొండుల భరతం పట్టేందుకు చట్టాన్నే తీసుకొస్తున్నారు. మంచిదే. అయితే ఇది క్షేత్ర స్థాయిలో చేయగలగాలి. పది రూపాయలు లంచం తీసుకున్నా చిన్న పాటి ప్రభుత్వ ప్యూన్ ని కూడా వదల కూడదు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ లంచాలు ఓ అలవాటుగా మారిపోయాయి. ఆ పద్దతి మార్చాలి. సీరియస్ గా యాక్షన్ తీసుకుని..ఫిర్యాదు పై వెంటనే స్పందించి పరిష్కారం చూపిస్తే జగన్ కి తిరుగుండదు.