Covid Test: కరోనా పరీక్ష విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఐసీఎంఆర్..!

Covid Test: ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం బూస్టర్ డోస్ ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది .దేశంలో అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది . అయితే కోవిడ్ టెస్టుల విషయంలో మాత్రం ఇప్పటికీ గందరగోళం కొనసాగుతూనే ఉంది .

కరోనా 1,2 వేవ్ లలో కరోనా సోకిన వారితో పాటు వారిని కలిసిన వారందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించేవారు . కానీ ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ టెస్టులు మాత్రం అందరికీ చేయటం లేదు . ఒమిక్రాన్ వేరియంట్స్ లక్షణాలు తీవ్రస్థాయిలో లేనందున కఠినమైన ఆరోగ్య పరిస్థితి ఏర్పడటం లేదు . అందువల్ల కరోనా పరీక్షల విషయంలో ఎవరెవరికి కోవిడ్ టెస్ట్ చేయాలి అన్న విషయానికి ఐసిఎంఆర్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ICMR జారీ చేసిన సూచనల ప్రకారం కరోనా లక్షణాలు కనిపించి విషమ పరిస్థితిలో ఉంటే తప్ప వారికి కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయవలసిన అవసరం లేదు . ఐసీఎంఈ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు గురించి తెలుసుకుందాం .

* దగ్గు జలుబు జ్వరం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి కరోనా లక్షణాలు కనిపించినప్పుడు కరోనా పరీక్ష తప్పక చేయాలి .
* బీపీ, షుగర్ మూత్రపిండాల సమస్యలు , ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించాలి .
* 60 సంవత్సరాలు పైబడినవారిలో దగ్గు జలుబు వంటి లక్షణాలు కనిపించినప్పుడు కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలి .
* అంతర్జాతీయంగా విమానాలలో , ఓడలలో ప్రయాణించే వారికి తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయాలి .

*కరోనా సోకిన వారికి కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు లేకపోతే కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు .
*కరోనా తగ్గిన తర్వాత కోవిడ్ సెంటర్ నుండి డిశ్చార్జ్ అయిన వారికి కరోనా పరీక్షలు అవసరం లేదు .
*ఏదేని శస్త్ర చికిత్స కోసం , డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయినవారికి ఈ లక్షణాలు కనిపిస్తే తప్పా కరోనా టెస్ట్ చేయవలసిన అవసరం లేదు .
*ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ప్రయాణించే వారికి కూడా కరోనా టెస్ట్ అవసరం లేదని ICMR వెల్లడించింది.