వైసీపీకి టీడీపీ ఎమ్మెల్యే అశోక్ చిక్కడం లేదా! టీడీపీ నేతలు గట్టిగా పట్టుకున్నారుగా!!!

గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కున్నాడు. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లలోనే టీడీపీ విజయం సాదించింది. ఆ గెలిచిన నేతల్లో కూడా చాలామంది ఇప్పటికే పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారు. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి నేతలు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. మరికొన్ని రోజుల్లో గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ తీర్థం పొచ్చుకొనున్నారు. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యేకు వైసీపీ గాలం వేస్తుంది కానీ ఆ నేత చిక్కడం లేదు. ఆ నేత ఎవరంటే ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్.

వైసీపీకి అశోక్ చిక్కడం లేదు

బెందాళం అశోక్ వరసగా రెండవసారి ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి కాలం నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే అశోక్ తండ్రి ప్రకాష్ మరణించినప్పటి నుండి అశోక్ వైసీపీలోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రకాష్ చనిపోయినప్పుడు అశోక్ ను పరామర్శించడానికి టీడీపీ నాయకులంటే ఎక్కువగా వైసీపీ నాయకులే వచ్చారు. అలాగే అశోక్ కొద్దిగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అశోక్ గాలం వేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని గమించిన టీడీపీ నేతలు అశోక్ ను గట్టిగా పట్టుకొని నచ్చచెప్పడం వల్ల అశోక్ మీడియా ముందుకు వచ్చి తాను టీడీపీలోనే పుట్టాను, ఇక్కడే ఎదిగాను, ఊపిరి ఉన్నంతవరకూ సైకిల్ పార్టీని వీడేది లేదు అంటూ పెద్ద ఒట్టే వేశారు. తనకు రాజకీయ జన్మను ఇచ్చి తన కుటుంబాన్ని మొత్తం కలుపుకున్న సైకిల్ పార్టీని ఎలా వదిలేసుకుంటానని చెప్పారు. అశోక్ వైసీపీలోకి తీసుకొని టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడును దెబ్బకొట్టడానికి వైసీపీ నాయకుల చేస్తున్న ప్రయత్నాలను అశోక్ ఇలా విఫలం చేశారు.

ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు బాబుకు షాక్ ఇస్తారా!

టీడీపీ నుండి వైసీపీ వరదల పర్వం కొనసాగుతుంది.అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బాబుకు షాక్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రాలో అచ్చంగా అరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. వీరిలో మెజారిటీ సైకిల్ దిగిపోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. చంద్రబాబు ప్రతీ రోజూ వారితో ఫోన్లో టచ్ లో ఉన్నా కూడా హ్యాండ్ ఇచ్చేది ఎవరో ఆయన కూడా కనిపెట్టలేకపోతున్నారుట. ఒకవేళ ఇదే కనుక జరిగితే టీడీపీ పరిస్థితి ఊహించలేం. ఈ నేతలను టీడీపీ అధినేత బాబు ఎలా ఆపుతారో వేచి చూడాలి.