Dry Fruits: బాదం పప్పు అమితంగా తీసుకోవటం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు విటమిన్స్ మినరల్స్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఏ విధమైన ఆహార పదార్థాలు అయినా అమితంగా తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బాదం పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పును రారాజు గా పరిగణిస్తారు. ఇటువంటి బాదం పప్పు కూడా ఎక్కువగా తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బాదం పప్పు లో విటమిన్ ఇ ,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు ప్రతిరోజు తినటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇవి శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.ఇన్ని ప్రయోజనాలున్న బాదంపప్పును ప్రతిరోజు మోతాదుకి మించి తీసి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

బాదంపప్పులు విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల అమితంగా బాదం తిన్నప్పుడు శరీరంలో విటమిన్ ఇ శాతం పెరిగిపోతుంది. విటమిన్ ఇ 1000 ఎం జి లకు చేరితే కడుపు నొప్పి ,తలనొప్పి ,విరేచనాల వంటి సమస్యలు మొదలవుతాయి. బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో టాక్సీన్ సాయి పెరిగిపోతుంది. అందువల్ల దాని ప్రభావం నాడీ వ్యవస్థ , శ్వాసకోస వ్యవస్థ మీద చూపుతుంది.

ప్రతిరోజు ఐదు బాదంపప్పులను రాత్రిపూట నానబెట్టి ఉదయం వాటి పొట్టు తీసి తినాలి. బాదం పప్పులో క్యాలరీస్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సమస్య పెరుగుతుంది. బాదాం పప్పులు మోతాదుకు మించి తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి. బాదాం పప్పులు తినే వారు తరచూ నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.