Health Care Tips: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అని అందరికీ తెలిసిన విషయమే. మనం రోజూ తినే వంటలలో వెల్లుల్లి వేస్తే వచ్చే రుచి చాలా బాగా ఉంటుంది. పచ్చి వెల్లుల్లి బరువు తగ్గించడంలో కూడా చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో సల్ఫ్యూరిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, విటమిన్ A, B, C లు పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి మీ యొక్క ఇమ్మునిటీ ని మెరుగుపర్చడానికి కూడా దోహదపడుతుంది. వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ కారణంగా దీని రుచి మరియు వాసన ఘాటుగా ఉంటాయి. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం, అమితంగా తీసుకుంటే అనారోగ్యం. వెల్లుల్లి కూడా ఇదే కోవకు చెందినదే. దీనిని ఎక్కువగా తింటే దాని పర్యవసానాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
ఆధునిక కాలంలో చాలామందిలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు అధికంగా చూస్తున్నాము. ఎసిడిటీ సమస్య ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తినకూడదు. దీనిని తినటం వల్ల ఎసిడిటీ మరింత ఎక్కువై, కొన్నిసార్లు దానిని తగ్గించుకోవడానికి డాక్టర్ ని సంప్రదించాల్సి రావచ్చు.
వెల్లుల్లి ఎక్కువ ఘాటుగా ఉంటుంది. నోటి సమస్యలు ఉండి, నోటి నుండి దుర్వాసన వచ్చే వారు వెల్లుల్లి తినడం వఈలన వారి సమస్య తీవ్రమవుతుంది. నోటి దుర్వాసన ఉన్నవారు.. మీ ఇంట్లో చిన్నచిన్న చిట్కాలను వాడటం వల్ల నోటి దుర్వాసన దూరం చేసుకోవచ్చు. పచ్చి కోతిమీర తినడం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు.
అలర్జీ సమస్యలు ఉన్న వారు వెల్లుల్లి తినడం వల్ల వారి సమస్యలు అధికమవుతాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఉన్న కారణంగా ఇది అలర్జీ లకు కారణమవుతుంది.
చాలామంది తల నొప్పి సమస్య ఉన్నవారు తక్షణ ఉపశమనం కోసం వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. అయితే వెల్లుల్లి వల్ల తలనొప్పి ఇంకా అధికమవుతుంది. తల నొప్పి సమస్యకు వెల్లుల్లిని వాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వెల్లుల్లి మాత్రమే కాదు… ఏదైనా మితంగా తీసుకుంటేనే అనారోగ్య సమస్యలు తప్పవు.