Anchor Anasuya: సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా మొదట్లో మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ రోజురోజుకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతో మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. లేకపోతే ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ అనసూయ తన పాత్ర గురించి అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ..నా లైఫ్ లో బన్నీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలియదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే విషయం ఒక పద్ధతిలో చెబితే మీ అభిమానులు దానిని మరొక పద్ధతిలో రిసీవ్ చేసుకుని నన్ను సోషల్ మీడియా వేదికగా బాగా తిట్టారు. ఈ విషయం మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. అయినా మీ మంచి మనసుతో మీరు నన్ను అర్థం చేసుకున్నారు అంటూ అనసూయ గురించి తెలియ చేశారు.
ఇక ఈ సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ అందరూ చెబుతున్న కంప్లైంట్ ప్రకారం నాకు కూడా ఈ సినిమాలో ఒక కంప్లైంట్ ఉందని, నన్ను ఈ సినిమాలో చాలా తక్కువ చేసి చూపించారని అనసూయ ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ పార్ట్ 2 లో మాత్రం మనమే చక్రం తిప్పుతానని ఈ ప్రెస్ మీట్ లో అనసూయ పుష్ప పార్ట్ 2 లో తన పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక మొదటి పార్ట్ లో అనసూయ దాక్షాయని అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రంగమ్మత్త పాత్ర తెచ్చుకున్న అంత గుర్తింపు మాత్రం దాక్షాయిని సంపాదించుకోలేక పోయింది.