Aishwarya: షూటింగ్ బ్రేక్ లో పెళ్లి చేసుకున్నా.. అంతే త్వరగా విడాకులు తీసుకున్నా.. నటి ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్!

Aishwarya: సీనియర్ నటి లక్ష్మి కుమార్తె గా వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే నటి ఐశ్వర్య బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను ఆలీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈమె తన కెరియర్ లో ఎంతో మంది దర్శకులతో పని చేశానని కానీ ఒక దర్శకుడి పై మాత్రం ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా కెరీర్లో అలాంటి డైరెక్టర్ ను ఎప్పుడూ చూడలేదు ఆయన చేసిన పనులను మర్చిపోయి కూడా తనని ఎంతో మంచిగా పలకరించాను.మనతో మాట్లాడుతున్నంత సేపు ఆ డైరెక్టర్ మంచిగా మాట్లాడిన ఆ తర్వాత మన గురించి లేనిపోనివి చెబుతారని ఈమె వెల్లడించారు.అలా ఇండస్ట్రీలో ఆ ఒక్క వ్యక్తి తప్ప మిగిలిన డైరెక్టర్స్ అందరిని తన గురువుగా భావిస్తానని ఈ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య ఆ డైరెక్టర్ గురించి తెలిపారు.

నిజం చెప్పాలంటే నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటి అంటే ఆ డైరెక్టర్ ను కొట్టకుండా వదిలి పెట్టడమే నేను చేసిన తప్పు అని ఈమె తెలిపారు. అయితే ఆ డైరెక్టర్ ఎవరు ఏమిటి అనే విషయాలు తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో షూటింగ్ బ్రేక్ లో వెళ్లి పెళ్లి చేసుకున్నానని అయితే ఎంత తొందరగా పెళ్లి చేసుకున్నానో అంతే తొందరగా విడాకులు కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అలీ ఎందుకు తల్లి నుంచి మీరు విడిగా ఉన్నారు అనే ప్రశ్న అడగడంతో అందుకు ఐశ్వర్య ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.