Jayavaani: వేణుమాధవ్‌ని ఎగిరి కాలితో తన్నా… డైరెక్టర్ వచ్చి తిట్టారు.. నటి జయవాణి!

Jayavaani: అదిరిందయ్యా చంద్రం సినిమా షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సన్నివేశాలను నటి జయవాణి ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు. ఓ సీన్‌లో వేణు మాధవ్ తాగి పడిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడ్రా బాబోయ్ అని తిట్టుకుంటూ వచ్చి సంకలో ఎత్తుకొని వెళ్లిపోవాలి. డైరెక్టర్ శ్రీనివాస్ వచ్చి ఈ సీన్‌ను రివార్సల్స్ చేద్దామని అన్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ఆయన అలా చెప్పగానే ఆయన చెప్పినట్టుగానే మామూలుగానే వచ్చాను. తిట్టుకుంటూ వెళ్లిపోయానని ఆమె అన్నారు. ఆయన టేక్ అనగానే వెంటనే కాలితో దనా దనా కాలితో తన్ని, ఎక్కడ పడితే అక్కడ పడిపోతావ్ అని లాక్కొని సంకలో ఎత్తుకొని వెళ్లిపోయానని ఆమె నవ్వుతూ తెలిపారు. అలా చేయడం వెంటనే టేక్ ఓకే కావడం అన్నీ కూడా వెంటనే అయిపోయానని ఆమె చెప్పారు.

ఆ సీన్ టేక్ అయిపోయాక డైరెక్టర్ శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి ఏంటమ్మా అక్కడ తన్నలేదు కదా నువ్వు.. అసలు ఇది లేదు కదా. నువ్వెలా తంతావు? వేణు మాధవ్ వెళ్లిపోతే ఏంటి పరిస్థితి ? అని ఆయన గొడవ చేస్తుంటే, అక్కడికి వేణు మాధవ్ వచ్చి చాలా బాగా చేశావ్. చాలా బాగా వచ్చింది సీన్ అని ఆయన అన్నట్టు ఆమె వివరించారు. ఆయన వచ్చి నన్ను రక్షించాడని ఊపిరి పీల్చుకున్నట్టు ఆమె తెలిపారు. తాను వేణు మాధవ్ గారు ఇంతకు మునుపే పరిచయం ఉన్నప్పటికీ సీన్‌లోకి వెళ్లిపోయానంటే తనేం చేస్తుందో ఒక్కోసారి తనక్కూడా తెలియదని జయవాణి స్పష్టం చేశారు.