సుడిగాలి సుధీర్ బాటలో హైపర్ ఆది… ఆ షో కి కూడా స్వస్తి చెప్పనున్నాడా…?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయి పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆది జబర్ధస్త్ లో అవకాశాన్నీ దక్కించుకున్నాడు. అదిరే అభి స్కిట్ లో కంటెస్టెంట్ గా తన జర్నీ మొదలుపెట్టిన అది అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో టీం లీడర్ గా ఎదిగాడు. హైపర్ ఆది పంచ్ లు, కామెడీ టైమింగ్ వల్ల జబర్ధస్త్ రేటింగ్స్ మరింత పెరిగాయని చెప్పటంలో సందేహం లేదు. ఇలా జబర్ధస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది సినిమాలలో నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నాడు.

ఆది పలు టీవీ షో లతోపాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. ఆది జబర్దస్త్ మానేయడానికి సినిమా అవకాశాలు కారణమని కొందరు అంటుంటే.. రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల వారి తో వచ్చిన గొడవల వల్ల జబర్దస్త్ మానేసాడు అంటూ మరికొందరు అంటున్నారు. ఎట్టకేలకు జబర్ధస్త్ లో ఆది లేకపోతే ఆ షో కల తప్పిపోయింది. ఇప్పుడు జబర్ధస్త్ రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. అయితే ఆది జబర్ధస్త్ ద్వారా ప్రేక్షకులని అలరించకపాయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వార ప్రతీ వారం సందడి చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఆది గురించి మరొక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది కనిపించేది కొన్నిరోజులే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మల్లె మాల వారితో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తి కావడంతో ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా గుడ్ బై చెప్పనున్నాడు అంటూ సమాచారం. ఆది జబర్ధస్త్ నుండి బయటికి రావటంతో ఆ షో రేటింగ్స్ పడిపోయాయి.. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ నుండి కూడా వెళ్ళిపోతే ఈ షో పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాగా ఆదికి కూడా సినిమా అవకాశాలు ఎక్కువ రావటం వల్ల, ఆది ఇకపై మల్లెమాల వారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కూడా లేవు అంటూ సమాచారం.