Husband: భార్యపై అనుమానంతో ఏకంగా అంతటి దారుణానికి తెగించిన భర్త?

Husband: భార్యాభర్తల మధ్య ఎన్నో రకాల గొడవలు వస్తుంటాయి. కానీ ఆ గొడవలకి అనుమానం అన్న పదం యాడ్ అయితే మాత్రం ఆ భార్యాభర్తల మధ్య కాపురం నరకంగా ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మాత్రమే తప్ప అనుమానం అనేది ఉండకూడదు. ఈ అనుమానం అన్న పదంతో భార్యలు భర్తలను, భార్యలను భర్తలు అనుమానిస్తూ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ అనుమానం కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. భార్య భర్తల మధ్యలో అనుమానం అన్న పదం మొదలైతే చాలు వారి కాపురంలో కలతలు మొదలైనట్లే. అనుమానంతో భార్యలను హత్య చేసిన ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి.

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఒక భర్త ఆమెను ఏకంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన కేరళలోని కొల్లం జిల్లా కడక్కల్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. జింసీ, దీపు అనే జంటకు కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది ఈ దంపతులకు ఏడేళ్ల కొడుకు నీరజ్ ఐదేళ్ల వయసు ఉన్న పాప కూడా ఉంది. ఇక ఈ దంపతులు తమ పిల్లలను చూసుకుంటూ సంతోషంగా ఉండేవారు. దీపు ఒక కంపెనీలో డ్యూటీ కి వెళుతూ ఉండేవారు. కొద్దిరోజులుగా తన భార్యకు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తుండటాన్ని దీపు గమనించాడు. అయితే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిదానంగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో తన భార్యని నిలదీసీ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయం లో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన దీపు తన భార్య పై దాడికి దిగారు. తన భార్య శరీరంపై 25 చోట్ల గాయాలు ఉన్నాయి అంతే అతడు ఆమెను ఎంత దారుణంగా చంపి ఉంటాడు అర్థం చేసుకోవచ్చు. ఆమెను కొట్టి చావుబతుకుల మధ్య ఆమె ని పట్టించుకోకుండా ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ఆమె ఇంటి చుట్టూ నిర్మానుష్య ప్రాంతం ఉండటంతో ఆమె కేకలు అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదు. అయితే తన తల్లిని ఆ స్తితిలో చూసిన ఆ ఏడేళ్ల కొడుకు దగ్గరలో ఉన్న ఒక షాపు దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి భార్యను చంపిన నేరానికి లొంగిపోయాడు దీపు. ఇతను తన భార్యను గతంలో కూడా చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు తన భార్యపై పెట్టుకున్న అనుమానం చివరికి అతడిని జైలుపాలు చేసింది. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.