రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నాయకులు వెనక్కి తగ్గరు. ఎందుకంటే ఈ ఖర్చును వాళ్ళు పెట్టుబడి అనుకోని పెడతారు. ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత అంతకు మించి సంపాదించవచ్చని నాయకుల అనుకుంటారు. అలా అనుకోని బొక్కబోర్లా పడ్డవారు ఉన్నారు అలాగే అనుకున్నదానికంటే ఎక్కువ సంపాదించిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలా ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బొక్కబోర్లా పడ్డ నాయకులు టీడీపీలో కూడా ఉన్నారు.
బొక్కబోర్లా పడ్డ నాయకులు
2014 నుండి 2019వరకు తాము చేసిన పాలనపై నమ్మకం లేని టీడీపీ నాయకులు, అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో డబ్బు ఎరగా వేసి గెలవాలని తీవ్రంగా ప్రయత్నించారు. డబ్బుల విషయంలో వెనక్కి తగ్గవద్దని పార్టీ అధిష్టానం నుండి కూడా 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న నాయకులకు ఆదేశాలు అందాయి. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నాయకులు అధిష్టానం మాట విని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. పార్టీ వస్తున్న నిధుల వ్యవహారాన్ని టీడీపీలోని ఒక మంత్రి నిర్వహించేవారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు రిజర్వేడ్ నియోజకవర్గాల్లో ఉన్న ఉన్న నాయకులకు మీరు ఇప్పుడు ఖర్చు పెట్టండి తరువాత పార్టీ అధిష్టానం నుండి నేను ఇప్పిస్తానని చెప్పడంతో అక్కడి నేతలు విపరీతంగా అప్పులు చేసి మరీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు రూ. 25కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎన్నికల్లో వైసీపీ దాటిని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోయారు. అలాగే ఖర్చు పెట్టిన నాయకులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆ నియోజక వర్గాల్లో ఉన్న నేతలు చెప్తున్నారు.
అధిష్టానం ఇచ్చిన పైసల్ ఎక్కడ!
ఖర్చు పెట్టిన నేతలు తమకు పార్టీ అధిష్టానం నుండి పైసల్ ఇప్పిస్తానని చెప్పిన అప్పటిని టీడీపీ మంత్రిని ఆడిగితే ” నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు, వెళ్లి పార్టీ అధిష్టానాన్ని అడగండి” అని చెప్తున్నాడు. వాళ్ళు వెళ్లి పార్టీ అధిష్టానాన్ని అడిగితే పైసల్ మొత్తం ఎన్నికలప్పుడే ఇచ్చేశామని చెప్తున్నారు. అధిష్టానం ఇచ్చిన పైసల్ ఆ మంత్రి దగ్గర లేవు, ఖర్చు పెట్టిన నాయకుల దగ్గర కూడా లేవు, మరీ ఆ డబ్బు ఎక్కడికి పోయాయని టీడీపీ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ పైసల్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.