Health Tips: మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో డ్రై ఫ్రూట్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.డ్రై ఫ్రూట్ మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు అందించి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. ముఖ్యంగా పిస్తా పప్పు వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పిస్తా పప్పులో మెదడు ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉంటాయి. మెదడుకి సంబంధించిన అనేక సమస్యలు తొలగించి మెదడు పని తీరు మెరుగు పడేలా చేస్తుంది.పిస్తాలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, విటమిన్-ఎ, కె, సి, బి-6, విటమిన్ ఇ, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ ఉన్నాయి. పిస్తా పప్పు తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు పిస్తా పప్పు తినటం వల్ల మెదడు రిలాక్స్ అయ్యి హాయిగా నిద్ర పడుతుంది.
పిస్తా పప్పులు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్జీమర్స్ రోగులు, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తి పెంచి మతిమరుపు సమస్య నివారిస్తుంది.
బిపి, షుగర్ వ్యాధులు ఉన్న వారు పిస్తా పప్పు తక్కువ తినటం మంచిది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు పిస్తా ఎక్కువగా తినటం వల్ల డయేరియా వ్యాది బారిన పడే ప్రమాదం ఉంది. బిపి ఉన్నవారు వేయించిన పిస్తా పప్పు ఎక్కువగా తినటం వల్ల వారి సమస్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పిస్తా పప్పు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.