Sleeping Tips: రాత్రి వేళఎంతసేపటికి నిద్ర పట్టడం లేదా? హాయిగా నిద్రపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి..!

Sleeping Tips: ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం, పని ఒత్తిడి పెరగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సకాలంలో డిజిటల్ స్క్రీన్ మీద ఎక్కువ సమయం పనిచేసే కారణంగా చాలా మందికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి వారు రాత్రివేళ నిద్ర నిద్రపట్టక నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇలా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు ఈ టిప్స్ పాటించండి వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ పడుకునే సమయంలో మొబైల్ ఫోన్ చేస్తూ సమయం వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల తిన్న ఆహారం జీర్ణం కాక నిద్ర సరిగా పట్టదు.అలాంటివారు రాత్రివేళ తొందరగా భోజనం చేసి కొంత సమయం వాకింగ్ చేసిన తర్వాత పడుకోవడం వల్ల ఆహారం తొందరగా జీవితం హాయిగా నిద్ర పడుతుంది.

రాత్రివేళ నిద్రపోవటానికి దాదాపుగా ఫోన్ టీవీ లాప్టాప్ వీటన్నిటిని దూరంగా ఉంచి.. గాలి బాగా తగిలే ప్రదేశంలో ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి. నిద్రకు ఆటంకం కలిగించే ఫోన్ దూరంగా ఉంచడం ద్వారా రాత్రివేళ హాయిగా నిద్రపడుతుంది.

ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో బాదం వాల్నట్ గత చేసుకోవటం వల్ల అందులో ఉండే రాగి, భాస్వరం మెగ్నీషియం, మాంగనీస్ వంటి మూలకాలు మన శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇవి తినడం వల్ల నిద్ర కు ఉపయోగపడే మెలటోనిన్ అనే రసాయనం విడుదలయి హాయిగా నిద్రపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కూడా హాయిగా నిద్ర పడుతుంది.

ప్రతి రోజు పడుకునే ముందు ఒక అరటిపండు తినడం వల్ల అందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం మన కండరాలను రిలాక్స్ చేసి, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గకుండా కాపాడుతాయి. తద్వారా రాత్రివేళ తొందరగా నిద్ర పడుతుంది.