కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

ఈ ఆధునిక కాలంలో చిన్న, పెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి వాటిలో కిడ్నీ సమస్యలు కూడా ప్రధానమైనవి అని చెప్పవచ్చు.
కిడ్నీ సమస్య ఉంటే అది మన శరీరంలోని ఇతర అవయవాల మీద కూడా దాని ప్రభావం చూపుతోంది. కిడ్నీలో రాళ్లు ఉండటం, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి కిడ్నీకి వచ్చే ముఖ్య అనారోగ్య సమస్యలు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా నయం చేయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మనం తీసుకొనే ఆహారం ద్వారా కొన్ని రసాయనాలు కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా మీరు ఎక్కువగా నీరు తాగకపోవటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవటంవల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తలెత్తుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇప్పుడు మనం కిడ్నీలో రాళ్లు తగ్గించటానికి కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వాటర్ ,లిక్విడ్స్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు 7 నుండి 8 లీటర్ల వరకు నీటిని తాగటం మన ఆరోగ్యానికి చాలా అవసరం. తులసి ఆకులలో ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత తులసి ఆకులను నమిలి తినటం, తులసి ఆకులు ఉప్పు వేసి దానిని మెత్తగా రుబ్బి తినటం లేదా తులసి ఆకులతో కషాయం చేసుకొని తాగటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పచ్చి ఉల్లిపాయను నమిలి తినటం లేదా ఉల్లిపాయ రసం రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ తాగటం వల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవారు వారి సమస్యను నయం చేసుకోవచ్చు.