Work From Home:కరోనా వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది. అయితే దీని వల్ల చాలామంది చాలా రకాలుగా నష్టపోయారు. కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే వారికి మాత్రం మేలు చేసింది అనే చెప్పవచ్చు. ఎప్పుడు ఉద్యోగం అంటూ ఇల్లు వదిలేసి ఎక్కడో సిటీలో ఉంటూ టైం కి తిండి లేక పనులు చేసేవారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు వీళ్ళకి. ఇంట్లో తల్లి, తండ్రి మధ్య ఉంటూ, ఫ్యామిలీ ఉన్న వారు ఫ్యామిలీ కి టైం స్పెండ్ చేస్తూ హ్యాపీ గా వర్క్ చేస్తున్నారు.
ఇంటి నుండి పని చేయడం సులువే అనుకుంటారు అందరూ. అయితే ఇది చాలా కష్టం. ఇంటి దగ్గర ఫ్రీ గా ఏదో ఒకటి తింటూ పని చేస్తుంటారు. ఎప్పుడు కూర్చొని ఉండటం వల్ల ఉభకాయం సమస్యలు ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటు గా బ్యాక్ పెయిన్ (నడుము నొప్పి) సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.
కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకి చెక్ పెట్టే అవకాశం ఉంది. నిద్రపోయేటపుడు తల కింద దిండు పెట్టుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అయితే పడుకునేటపుడు తల కింద దిండు లేకుండా పడుకోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామాల వల్ల కూడా నడుము నొప్పి తగ్గుతుంది. భుజంగాసనం, మర్కటాసనం, మకరాసనం, శలభాసనం రోజూ చేయడం వల్ల నడుము నొప్పి కి చెక్ పెట్టవచ్చు.ఇంటి నుండి పని చేసే వాళ్ళు ఇవి పాటించడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇవి చేశాక కూడా మీకు నొప్పి ఎక్కువగా ఉంటే దగ్గర్లోని డాక్టర్ను సంప్రదించడం మంచిది.