HIV: స్టెమ్ సెల్స్ తో అద్భుతం.. హెచ్ఐవి నివారణలో కీలక పాత్ర..!

HIV:గత 30 సంవత్సరాలుగా ప్రపంచం చాలా భయబ్రాంతులకు గురి చేస్తున్న సమస్య హెచ్ఐవి ఎయిడ్స్. శాస్త్రవేత్తలు దీనిని పూర్తిగా నిర్మూలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. హెచ్ఐవి నీ కేవలం తాత్కాలికంగా నిర్మూలించడానికి సాధ్యపడుతుంది. కానీ శాశ్వత పరిష్కారం ఎవరికి ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధిని పూర్తిగా నయం చేసి వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. తొలిసారి ఒక మహిళ లో హెచ్ఐవి ని పూర్తిగా నయం చేసి చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచంలో హెచ్ఐవి పూర్తిగా నయం అయిన మూడవ పేషెంట్ గా, మహిళలలో మొదటి పేషంట్ గా ఆమె నిలిచారు. Stem cells transplantation (మూల కణాల మార్పిడి) చికిత్సతో ఒక మహిళ ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ నుండి పూర్తిగా విముక్తి పొందినట్టు వైద్యులు ప్రకటించారు.

గతంలో టిమొతీ రే బ్రౌన్ అనే అతను 12 ఏళ్ల పాటు హెచ్ఐవి మిషన్ పొందారు. ఇతనిని బెర్లిన్ పేషెంట్ గా పిలిచేవారు. అనంతరం లండన్ పేషెంట్ గా పిలవబడే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్ఐవి రెమిషన్ లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుతం మనం చెప్పిన మహిళ పూర్తిగా హెచ్ఐవి నుండి ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను శాస్త్రవేత్తలు యుఎస్ లో జరిగిన సి ఆర్ వో ఐ సదస్సులో వెల్లడించారు. ఈ సదస్సు ఫిబ్రవరి 15న జరిగింది. మూల కణాల మార్పిడి అనంతరం గత 14 నెలలుగా ఆమె ఎటువంటి యాంటీ వైరస్ థెరపీ తీసుకోలేదని, అయినా కూడా ఆమెలో ఎటువంటి హెచ్ఐవి లక్షణాలు కనిపించడం లేదని వారు తెలిపారు.

పరిశోధకులు మాట్లాడుతూ బొడ్డు పేగు నుండి తీసుకున్న స్టెమ్ సెల్స్ తో హెచ్ఐవి రెమిషన్ సాధ్యపడింది అని తెలిపారు. 2015 నుండి హెచ్ఐవి సోకిన 25 మంది పేషంట్ ల మీద పరిశోధనలు జరిపి ఫలితాలు నమోదు చేసింది. ప్రస్తుతం హెచ్ఐవి నుండి బయటపడిన మహిళ మైలాయిడ్ లుకేమియా తో బాధపడుతోంది. ఇదే సమయంలో ఆమెకు హెచ్ఐవి సోకడంతో ఏఆర్ టి తీసుకుంటోంది. ఆమె 2017 వ సంవత్సరం స్టెమ్ సెల్స్ తో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంది. దాని తర్వాత 37 నెలకు ఏ ఆర్ టి కూడా ఆపేసింది. ఆమె ఏ ఆర్ టీ ఆపేసి ఇప్పటికీ 14 నెలలు అయినా కూడా ఆమెలో ఎటువంటి హెచ్ఐవి కణాలు ఉన్నట్టు బయటపదలేదు. అయితే స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఖరీదైన వైద్యం అని, ఈ వైద్యం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. దాత, గ్రహీత యొక్క ఇమ్మునిటీ కణాల మార్పు వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి అని డాక్టర్లు తెలిపారు.