గోరంట్ల మాధవ్ ఎంపికే జగన్ చేసిన తప్పా.. గత చరిత్ర తెలీదా అంటూ?

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అభ్యంతరకర వీడియో గురించి ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ గోరంట్ల మాధవ్ కు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చి తప్పు చేశారని ఆయన గత చరిత్ర గురించి తెలుసుకోకుండా జగన్ తప్పు చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోరంట్ల మాధవ్ ప్రవర్తన వల్ల వైసీపీకి చెడ్డ పేరు వచ్చిందనే సంగతి తెలిసిందే.

వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ వీడియో అని ఆయన చెబుతున్నా ఆ వీడియో ఒరిజినల్ వీడియోనో మార్ఫింగ్ వీడియోనో తేల్చడం అయితే సులువు కాదనే సంగతి తెలిసిందే. ఆ వీడియో మార్ఫింగ్ వీడియో అని నివేదిక వచ్చినా ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వమే ఆ విధంగా నివేదిక ఇప్పించిందని కూడా ఆరోపణలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

గతంలో పృథ్వీరాజ్ ఒక మహిళతో మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో జగన్ సూచనల మేరకు పృథ్వీరాజ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ గొంతు తనది కాదని పృథ్వీరాజ్ ఎంత చెప్పినా వైసీపీ నేతలు సైతం నమ్మలేదు. అయితే గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి మొదటినుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో కియా కంపెనీ ప్రతినిధులను బూతులు తిట్టడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు.

గోరంట్ల మాధవ్ తన ప్రవర్తన వల్ల పోలీస్ గా పని చేస్తున్న సమయంలో చాలాసార్లు ఛార్జీ మెమోలు తీసుకున్నారని ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయని సమాచారం. గోరంట్ల మాధవ్ వల్ల జగన్ పరువు కూడా పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు హిందూపురం వైసీపీ ఎంపీ టికెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.