Crime News: సాధారణంగా హిజ్రాలు రోడ్ల మీద నిలబడి పోయే వాహనాలను అవుతూ వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఇవ్వని వారి వాహనాలను ఆపి డబ్బుల కోసం నాన రచ్చ చేస్తారు. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఇటీవల కర్నూలు జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఆపి వారి మీద దాడికి పాల్పడ్డారు. నంద్యాల పట్టణం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. పాణ్యం మండలం రాంభూపాల్‌రెడ్డి తండాకు చెందిన బాలనాయక్, హనీమాబాయి దంపతులు హోలీ పండగ సందర్భంగా ఇంట్లో కి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేయటానికి ద్విచక్ర వాహనం మీద నంద్యాల పట్టణానికి బయలుదేరారు. నంద్యాల పట్టణం సమీపంలోని ఆటోనగర్ శివారులో హనీ, ఆశ అనే హిజ్రాలు బాల నాయక్ , హనీమాబాయి వెళ్తున్న బైక్‌ను అడ్డగించి డబ్బు కోసం డిమాండ్ చేశారు. బాల నాయక్ తన వద్ద చిల్లర డబ్బులు లేవు అని చెప్పినా కూడా వినకుండా ఇద్దరు హిజ్రాలు బలవంతంగా బాల నాయక్ జేబులో చేతులు పెట్టి రూ100 నోటు లాక్కునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో లో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి డబ్బులు ఇవ్వలేదు అన్న కోపంతో బైక్ పై ఉన్న ఆ దంపతులను కిందకి తోసి వారి మీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాలనాయక్ భార్య మెడలో ఉన్న రెండు తులాల బంగారు తాళిబొట్టు గొలుసు కనిపించకపోవటంతో బాలా నాయక్ దంపతులు రూరల్ సీఐ మురళీమోహన్‌రావును కలిసి ఫిర్యాదు చేశా రు. పోలీసులు హిజ్రాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.