నటుడు బాలయ్య పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిజ్రాలు?

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోగా కొనసాగుతూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పలుమార్లు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణపై హిందూపురం నియోజకవర్గం హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బాలకృష్ణ నియోజకవర్గంలో కనిపించడం లేదని నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఆయన ఎక్కడో ఉంటున్నారు వెంటనే ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలి అంటూ చిత్రాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విధంగా హిజ్రాలు బాలకృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇదివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజలు ఫిర్యాదులు చేసిన సంఘటనలను మనం చూసే ఉన్నాం.

ఈ క్రమంలోనే మొదటిసారిగా ఎమ్మెల్యే బాలకృష్ణపై హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందమూరి అభిమానులు మండిపడుతూ హిజ్రాలు ఫిర్యాదు చేయడం వెనుక ఇతరుల ప్రమేయం ఉందని మండిపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గంలో ఉండడం లేదు. అయినా ఒక బాలకృష్ణ పైనే ఇలా ఫిర్యాదు చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హిజ్రాలు ఫిర్యాదు చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనే విషయంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఈ విషయంపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.