Pooja Hedge: ఆ హీరోతో లిప్ లాక్ లో మునిగి తేలిన పూజ హెగ్డే… షాక్ ఇచ్చిన సెన్సార్?

Pooja Hegde_9

Pooja Hedge: ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈమె తెలుగులో చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో కనిపించి సందడి చేశారు. అయితే వరుసగా పూజా హెగ్డే నటించిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్న ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది ఇలా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన చిత్రం దేవ ఈ సినిమా జనవరి 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇందులో పెద్ద ఎత్తున లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో సెన్సార్ ఇలాంటి సన్నివేశాలను కట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా భారీ రొమాంటిక్ బోల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలతో పాటు విపరీతమైన రొమాంటిక్ సన్నివేశాలు కాస్త అభ్యంతరకర పదాలు కూడా ఉన్న నేపథ్యంలో సెన్సార్ అలాంటి కొన్ని సన్నివేశాలకు కట్ చెప్పింది. ఇక ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో సెన్సార్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక అవకాశాలు లేకపోవడంతోనే పూజా హెగ్డే ఇలాంటి బోల్డ్ సన్నివేశాలకు కూడా కమిట్ అయ్యారని మరి ఈ సినిమా అయినా బుట్ట బొమ్మను కాపాడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.