Gallery

Home News C Vitamin: ఈ లక్షణాలు కనిపిస్తే 'సి విటమిన్' లేనట్టే..! పెంచుకోండిలా..

C Vitamin: ఈ లక్షణాలు కనిపిస్తే ‘సి విటమిన్’ లేనట్టే..! పెంచుకోండిలా..

C Vitamin: మన శరీరానికి ‘విటమిన్ సి’ ఎంతో అవసరం. ప్రస్తుత కరోనా సమయంలో మనకు రకరకాల ఇన్ ఫెక్షనలు సోకకుండా విటమిన్ సి కాపాడుతుంది. అది శరీరంలో సరిపడినంత ఉండాల్సిందే. విటమిన్ సిని పెంచుకునేందుకు కూడా కొన్ని ఆహార పద్ధతులు ఉన్నాయి. అవేమిటో చూద్దాం..

Hero Article Vitamin C Compressor 1 | Telugu Rajyam

సి విటమిన్ మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి చెడు బ్యాక్టీరియా రాకుండా అడ్డుకుంటుంది. బాడీలో సీ విటమిన్ ఎంత ఉంటే అంతగా క్రిములపై అంతగా పోరాడుతుంది. మెటబాలిజంను పెంచుతుంది.. హై-బీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. శరీరాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు రాకుండా సి విటమిన్ కాపాడుతుంది. ఒత్తిడి, టెన్షన్ తగ్గించేందుకు ఉపకరిస్తుంది.

‘సి విటమిన్’ నిమ్మకాయలు, బత్తాయిలు, కమలాలు, నారింజలు, ఉసిరి.. వంటి పుల్లటి పండ్లు.. యాపిల్, పచ్చిమిర్చి, ద్రాక్ష, బొప్పాయి, గూస్ బెర్రీ, స్ట్రాబెర్రీస్, పుచ్చకాయ, కివీ పండ్లలో కూడా సి విటమిన్ ఉంటుంది. వీటితోపాటు ఎరుపు, పసుపు కాప్పికమ్, మొలకలు, బ్రకోలీ, కాలీఫ్లవర్ ను ఎక్కువగా తింటూ ఉండాలి. అల్లంలో సి విటమిన్ ఎక్కవగా ఉంటుంది. రకరకాల వ్యాధుల్ని అడ్డుకునే శక్తి ఎక్కువ. తులసి ఆకుల వల్ల ప్రయోజనాలు ఎక్కువ.

రోజూ కొన్ని తులసి ఆకుల్ని తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. తులసితోపాటు… 3-4 మిరియాలు, స్పూన్ తేనెను తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. కరోనా అటాక్ కాకుండా ఆపే శక్తి కూడా ఉంటుంది. అల్లం టీ, తేనె, అల్లం రసం వల్ల ప్రయోజనం ఎక్కువ. రోజుకు మూడు-నాలుగు సార్లు అల్లం తీసుకుంటే… ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది.

‘విటమిన్ సి’ సున్నితమైనది. దానిని మనం నిత్యం కాపాడుకోవాలి.. దక్కించుకోవాలి. శరీరానికి వేడి చేసినా వెళ్లిపోతుంది. శరీరంలో ‘విటమిన్ సి’ సరిపడా లేకపోతే నీరసం వస్తుంది. ఏ పని చెయ్యబుద్ధి కాక.. అలసిపోయినట్టు అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ సి దక్కించుకోవాలి. లేదంటే రోగాలను మన శరీరం ఆపలేదు.. తిన్న ఆహారం కూడా సరిగ్గా అరగదు. పిల్లల్లో విటమిన్ సి సరిపడా లేకపోతే వారి ఎముకల్లో బలం ఉండదు. అందుకే ఇది చాలా ముఖ్యమైనది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News