ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద జాగ్రత్త పెరిగి ఆరోగ్యానికి అవసరమైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. వాటిలో ఆయుర్వేద మరియు ప్రాచీన కాలపు ఆహారపు పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో వేసవి కాలం, శీతాకాలం అంటూ సంబంధం లేకుండా రోగాలు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
దగ్గు జలుబు ,జ్వరం, తలనొప్పి ,వాంతులు వంటివి శీతాకాలంలో వస్తాయి. శీతాకాలంలో అనారోగ్య సమస్య బారిన పడకుండా మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలి. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆయుర్వేద వనమూలికలతో తయారైన హెర్బల్ ‘టీ’ ని తాగటం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం హెర్బల్ ‘టీ’ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటారు తెలుసుకుందాం.హెర్బల్ ‘టీ’ చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. “అల్లం టీ” సాధారణంగా అల్లంలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. శీతాకాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రస్తుతం అందరూ ఉదయమే “గ్రీన్ టీ” తో పాటు “బ్లాక్ టీ” తాగటం అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీ తాగటం వల్ల మన అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే బ్లాక్ టీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇలా “మందారం టీ” ,”లెమన్ గ్రాస్ టీ”, “పుదీనా టీ” వంటి ఎన్నో రకాల “హెర్బల్ టీ” లో యాంటీబ్యాక్టీరియల్, ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండి మన శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.