Health Tips: సాధారణంగా ఆకుకూరలు , కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. సాధారణంగా ఒక్కో రకం కూరగాయలలో ఒక్కో రకమైన పోషక విలువలు దాగి ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అయితే సామాన్యులు కూడా కొనగలిగే ధరలతో విరివిగా లభించే కూరగాయలలో దొండకాయ కూడా ఒకటి. సాధారణంగా చాలామంది దొండకాయలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపరు.. కానీ వాటి లో దాగి ఉన్న పోషక విలువల గురించి తెలిస్తే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కచ్చితంగా దొండకాయను చేర్చుకుంటారు. దొండకాయ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దొండకాయ సైజులో చిన్నగా ఉన్నప్పటికీ వాటిలో ఎన్నో రకాల విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సోడియం, జింక్ వంటి ఎన్నో రకాల శరీర ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక రూపంలో దొండకాయ తినటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది. దొండకాయలో క్యాల్షియం ఉండటం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండటానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
దొండకాయ లో ఉండే ఎన్నో రకాల విటమిన్స్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. క్యాన్సర్ సమస్యలు, ఆస్మా సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ దొండకాయలు తినడం వల్ల కొంతమేర ప్రయోజనం ఉంటుంది. దొండకాయలో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ల దృష్టి లోపాలు ఉన్నవారికి కూడా ఎంతో మేలు చేస్తాయి.