Health Tips: పిల్లలపై డిజిటల్ స్క్రీన్ ప్రభావం తగ్గించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

Health Tips: దేశంలో కరోనా కారణంగా పిల్లలు, పెద్దలు ఇంటివద్దనే ఉండాల్సి వస్తోంది. పిల్లలకు స్కూల్లు మూతపడ్డాయి. పెద్దవారు వర్క్ ఫ్రొం హోమ్ అని ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు. పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అంటూ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. సాధారణంగా ఈ కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కి బాగా అలవాటు పడిపోయారు. ఈ కరోనా కారణంగా ఇంట్లో ఉండి వీటన్నిటికీ బాగా అడిక్ట్ అయిపోయారు.

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఫోన్,లాప్టాప్ అంటూ వాటితోనే సమయం గడుపుతున్నారు. ఎక్కువగా ఫోన్ ల్యాప్ టాప్ చూడటం వల్ల ఆ డిజిటల్ స్క్రీన్ పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. ఎక్కువ కాలం డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల భవిష్యత్తులో పిల్లలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల ఆ అలవాటు కట్టడి చేయడం చాలా అవసరం. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల పిల్లల ఆరోగ్యం కాపాడవచ్చు.

పిల్లల తల్లిదండ్రులు వారి ఆరోగ్యం సృష్టిలో ఉంచుకొని డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా చూడకుండా నియంత్రించాలి . పిల్లలలో ఏ చిన్న సమస్య తలెత్తిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎక్కువ సమయం పిల్లలు లాప్టాప్ ఫోన్ అంటూ డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల వారి కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని ఎఫెక్ట్ పిల్లల మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సాధ్యమైనంత వరకు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా కళ్ళకు ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను జతచేయాలి.

పిల్లలను ప్రతిరోజు వ్యాయామం చేయటానికి ప్రోత్సహించాలి. వ్యాయామం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తోంది. వారు చేసే వ్యాయామాలలో కళ్ళకు ,వేళ్ళకు ఉపయోగపడే వ్యాయామాలు ఎక్కువగా చేయించాలి. ఇలా ప్రతిరోజు పిల్లలు వ్యాయామాలు చేయడం వల్ల మెదడు చురుగ్గా పని చేసి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.